రాజకీయ నాయకులు (Politicians):
రాజకీయ నాయకులు (Politicians) సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్నారని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు నేతలు అపహాస్యపు పనులు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారికి పోలింగ్ బూత్ లలో సమాధానం చెప్పాలని అన్నారు. చదువు ఎంత ముఖ్యమో, సంస్కారం కూడా అంతే ముఖ్యమని అన్నారు. స్థాయి మరిచి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. విశాఖలోని ఓ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మాతృభాష కళ్లు లాంటిదని… తల్లిలాంటి భాషను ఎవరూ మర్చిపోకూడదని వెంకయ్య చెప్పారు. విలువలతో కూడిన విద్య ఉంటేనే విలువలతో కూడిన పౌరుడిగా తయారవుతారని అన్నారు. ఇప్పుడు విలువలతో కూడిన విద్య తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో ఉన్న మేధోశక్తి వల్ల ప్రపంచమంతా మనవైపు చూస్తోందని చెప్పారు. భగవంతుడు ఏం కావాలని అడిగితే మళ్లీ విద్యార్థి దశకు తీసుకెళ్లాలని కోరుకుంటానని అన్నారు. గూగుల్ అనేది గురువుని మించింది కాదని చెప్పారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. Read Also..
Follow us on :Facebook, Instagram& YouTube.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.