కరీంనగర్ జిల్లా జగిత్యాలలో రైతులు ధర్నా నిర్వహించారు. NH 63 జాతీయ రహదారి నిర్మాణం కోసం చేస్తున్న సర్వే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హన్మాజీ పేట్, పెరకపల్లి, తిప్పన్నపేట, చర్లపల్లి, చల్గల్, తాటిపల్లి రైతులు జగిత్యాల పాత బస్ స్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సర్వేలో తమ భూములు కోల్పోతున్నామని వారు వాపోయారు. ప్రాణాలైనా అర్పిస్తాం కాని తమ భూములు వదులుకోమని స్పష్టం చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రోల్ సభలు నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సభల రూపంలో జరిగే ఈ కార్యక్రమాల్లో బూత్ స్థాయి అధికారులు…
సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా పర్యటన ప్రణాళిక లేదని విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి రాకముందే రేవంత్‌రెడ్డి విదేశీ…