Politics :
రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది.. బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. రామాంజనేయులు చేరిక జనసేనకు చాలా కీలకం అని తెలిపారు. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారారు. గతంలో నేను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు. 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్నిచ్చింది. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి.. అలయెన్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారాడు. కుబేరులు ఉండే భీమవరం పట్టణం ఒక రౌడీ చేతులో బందీ అయింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం, వర్గంపై పడుతుంది. యుద్ధం తాలూకూ అంతిమ లక్ష్యం.. ప్రభుత్వాన్ని మార్చేలా చేయడం అని అన్నారు. జగన్‌కు ఆ యుద్ధం ఇద్దాం అని పిలుపునిచ్చారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పు అవుతుంది. జగన్ తాలూకూ జలగలను తీసిపారేయాలి.. భీమవరంలో ఉండే జలగతో సహా వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వస్తుందో అర్థం చేసుకోవాలి. పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకు వచ్చా. భీమవరం వదలను.. నాది. అక్కడి నుంచి రౌడీయిజం పోవాలి. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్ యార్డ్‌ను సరిచేస్తాం. మే 15లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవుతుంది. సిద్ధం.. సిద్ధం అని కోకిలలా కూస్తోన్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం అని అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి