మీరు వేసిన ఓట్లు తరువాత ఫలితాలు చూసాక నా కంట్లో అనాధ భాష్పాలు వచ్చాయని, ఫలితాలు చూసి మేము పడ్డ 5 సం. కష్టాన్ని మరిపోయమని ఆయన అన్నారు. మేము మా జీవితంలో మర్చిపోలేని రోజు ఫలితాలు వచ్చిన రోజని, జెండా పట్టిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని అన్నారు. 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాం అనుకోలేదని, మీ కష్టం మీ ఆదరణ వలనే అది సాధ్యం అయ్యిందని అన్నారు. ఇది మన ప్రభుత్వం 10 సం. మీరు పడ్డ భాధలకి ఈ రోజు విముక్తి లభించిందని, భవిష్యత్తులో మేము ఇచ్చిన ప్రతి మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని, అన్నారు. మీ అందరికీ ఇల్లు కట్టిచే భాధ్యత కాంగ్రెస్ పార్టీదని, ఉమ్మడి జిల్లాలో చాలా భూ సమస్యలు ఉన్నాయని, అవన్నీ పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి ఒకరోజు కేటాయిస్తానని, కొత్తగూడెం లో ఉన్న భూకబ్జా దారుడిని, రేపిస్ట్నీ మీరు మీ తీర్పు ద్వారా ఇంటికి పంపించారని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో నిలబడాలని ప్రతి గుమ్మం తిరిగాను కానీ పొత్తులో భాగంగా మిత్ర పక్షంమైన సిపిఐకి కేటాయించాల్సి వచ్చిందని ఎవరు ఊహించని విధంగా జిల్లాలో మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించారని ఆయన అన్నారు.
పొంగులేటి సంచలన కామెంట్స్…
97
previous post