చిత్తూరు (Chittoor):
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం జరిగే సీఎం సభకు మారుమూల ప్రాంతాలు పలమనేరు, కుప్పం, పుంగనూరు మిగిలిన ప్రాంతాల నుండి జన సమీకరణ లో భాగంగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని వైసీపీ నాయకులు దాదాపు 390 బస్సు సర్వీసులు గాను 90 బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో, కుప్పం పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రాప్తాడులో జరిగే సిద్ధం సభ విజయవంతం చేయడానికి చిత్తూరు జిల్లాలోని నాయకులు జన సమీకరణలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రజలను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్ష జరుగుతున్న సమయంలో బస్సుల కోసం విద్యార్దులు ఎదురుచూస్తున్నారు. కేవలం అరకొర బస్సు సర్వీసులు మాత్రమే కుప్పం, పలమనేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.