పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్ షిప్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏడో తరగతి చదువుతున్న జెట్టి వర్షిత్ ను అకారణంగా ప్రిన్సిపల్ రవికాంత్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు & కార్పొరేటర్ జెట్టి జ్యోతి- రమేష్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగాయి. సదరు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ బలవంతంగా విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు స్కూల్ నుంచి తీసుకువెళ్లారు.
శ్రీ చైతన్య స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన…
56
previous post