అధికారులపై మండిపడ్డ పురందేశ్వరి

Purandeshwari

Advertisements

&NewLine;<p>తుఫాన్ కారణంగా తడిసినా&comma; రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు&period; ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజవర్గం పుళ్ళ&comma; కైకరం&comma; తల్లాపురం గ్రామాలలో పంట నష్టపోయిన వరి రైతులను పరామర్శించారు&period; ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ రైతుల వద్ద నుండి ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం వెంటనే సేకరించాలని కోరారు&period; అలాగే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు సరైన వసతి సదుపాయాలను కల్పించాలన్నారు&period; కేంద్ర ప్రభుత్వం అటల్ ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలుపరచలేదని విమర్శించారు&period; దీనివలన రైతులు బీమా సహాయాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు&period; రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు&period; తుఫాన్ కారణంగా ఇంత భారీ నష్టం జరిగినా ఇంతవరకు అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయకపోవడంపై పురందరేశ్వరి మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్