భక్తులతో కిక్కిరిసిన రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం

Rajarajeswara Swami's Devasthanam

Advertisements

&NewLine;<p>దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సోమవారం నాడు భక్తులతో రద్దీగా మారింది&period; వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని తరించారు&period; తొలుత ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి&comma; ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు&period; అనంతరం సర్వదర్శనం&comma; ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు&period; భక్తుల రద్దీ కారణంగా లఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు&period; కళాభవన్‌లో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం&comma; సత్యనారాయణ వ్రతం&comma; బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు&period; స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును పెద్ద సంఖ్యలో భక్తులు చెల్లించుకున్నారు&period; అనుబంధాలయమైన బద్దిపోచమ్మ దేవాలయం సైతం భక్తులతో క్రిక్కిరిసిపోయింది&period; వందలాది మంది భక్తులు బద్దిపోచమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు&period; ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.