67
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసీ ఎకరాకు 40,000 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా చాటపర్రు మండలం, తిమ్మారావు గూడెంలో నీట మునిగిన పంట పొలాలను సిపిఐ నేత పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ విడిచి పొలాల్లోకి రావాలన్నారు. తుఫాను బాదిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతుల బ్యాంక్ రుణాలు రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also..
Read Also..