బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవించిన మహోన్నత వ్యక్తి పేదల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే రూపం వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నార్టీ సెంటర్ నందు పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వంగవీటి మోహన్ రంగా జీవితం బడుగు బలహీన వర్గాలకే అంకితం అని ఆయన పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా చేరగని ముద్ర వేసుకున్నారు. వంగవీటి పేద ప్రజల కోసం చేసే సేవలను చూసి కొంతమంది రాజకీయ దుండగులు ఓర్వలేక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వంగవీటికి ఎటువంటి భద్రతా లేని సమయంలో హత్యకు గురి చేశారు.
ఆడుదాం ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో అడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల నిర్వహణ జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజేష్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక జగనన్న ప్రభుత్వంలో రూపొందించామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ ఎదిగేలా జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందించారు.