ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న మైనింగ్ మాఫియా ..

ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న మైనింగ్ మాఫియా

Advertisements

<p>కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి&period; గోపవరపు గూడెం శివారులో నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో ఎర్రమట్టి క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికులను కలవరపెడుతున్నాయి&period; అనుమతులు లేకుండానే కొన్ని చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి &period;మరో కొన్ని చోట్ల అనుమతుల పరిమితిని మించి నాలుగు నుంచి ఐదు అంతస్తుల లోతు వరకు తవ్వుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు&period; భూగర్భంలోని ఎర్రమట్టిని పెద్ద ఎత్తున తరలించడంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; ముఖ్యంగా భూగర్భ జలాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాపోతున్నారు &period; నీటి వనరులు క్షీణిస్తే భవిష్యత్తులో తాగునీటి సమస్య మరింత తీవ్రం అవుతుందని భయపడుతున్నారు&period; ఈ పరిస్థితుల్లో అధికారుల నిర్లక్ష్యం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; వెంటనే సంబంధిత శాఖలు స్పందించి తవ్వకాలను నిలిపివేసి&comma; పరిస్థితిని సమీక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>గన్నవరం మండలం గోపవరపు గూడెం పరిసరాల్లో కొనసాగుతున్న క్వారీ తవ్వకాల వల్ల స్థానిక ప్రజల్లో భయాందోళనలు మరింత పెరుగుతున్నాయి&period; భూమిని అధిక లోతు వరకు తవ్వడం వల్ల భూగర్భంలో ఖాళీలు ఏర్పడి&comma; భవిష్యత్తులో నేల కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; ఈ ప్రభావం సమీపంలోని వ్యవసాయ భూములపై కూడా పడుతూ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది&period; పంటలు సాగు చేయడానికి అవసరమైన నీటి వనరులు తగ్గిపోవడం రైతులను ఆర్థికంగా కుంగదీస్తోంది&period; అంతేకాక ఈ క్వారీకి ఇచ్చిన అనుమతుల పరిమితి ఎంత&comma; ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలు ఆ పరిధిలోనే ఉన్నాయా అనే అంశంపై స్పష్టత లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది&period; ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు&comma; మైనింగ్ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు&period; బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..