మంగళగిరి (Mangalagiri) :
మంగళగిరి (Mangalagiri)లో అభివృద్ది జరగలేదని స్వయంగా విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారన్నారు.. తాడేపల్లి టీడిపి మండల అధ్యక్షులు సుబ్బారావు. 5 సంవత్సరాలు కనపడని మీరు ఎన్నికలు రాగానే మంగళగిరి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. పట్టణ వైసీపీ కార్యాలయాల ప్రారంభ కార్యక్రమంలో ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నారా లోకేష్ ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్న ఏకైక పార్టీ టీడిపి అని.. సాక్షాత్తు సీఎం జగన్ మంగళగిరిలో ప్రచారం చేసినా.. నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేసారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఎన్నికలు రాగానే మంగళగిరి గుర్తుకొచ్చిందా ?
1 comment
👍
Comments are closed.