తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి..

revanth reddy

Advertisements

&NewLine;<p>రేవంత్ రెడ్డి… తెలంగాణ రాజకీయాల్లో పడిలేచిన కెరటం ఆయన&period; తెలుగు రాజకీయాలలో సంచలనాలకు చిరునామా&period; వివాదాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు&period; ఆర్ఎస్ఎస్&comma; తెలుగుదేశం పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషం&period; అధిష్టానం ఆశీస్సులతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం మరో విశేషం&period; పార్టీని అధిక స్థానాలలో గెలిపించడం అంతకన్నా గొప్ప విశేషం&period; తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న వారికి గట్టి సమాధానం చెప్పారు రేవంత్&period; కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు&period; టీపీసీసీ అధ్యక్షుడిగా సవాళ్లు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు&period; 2021లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి… సుదీర్ఘ కాలంగాపాటు పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు&period; జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ కు ఆ తర్వాత ఉపఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి&period; ఆ సమయంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి సీనియర్ల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి&period; వారిని సమన్వయం చేసుకుంటూనే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ తనదైన ముద్ర వేశారు&period; రేవంత్ రెడ్డిది మహబూబ్ నగర్ జిల్లా&period; ఊరు కొండారెడ్డి పల్లె&period; తండ్రి నరసింహారెడ్డి&period; తల్లి రామచంద్రమ్మ&period; 1969 ఆగస్టు 8à°¨ జన్మించారు&period; రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు&comma; ఒక సోదరి&period; టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు&period; ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు&period; అనంతరం డిగ్గీ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు&period; అక్కడి నుంచి విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు&period; 1992లో ఉస్మానియా అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు&period; చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్… పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు&period; ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్ లో చురుకుగా పనిచేశారు&period; డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా కొంతకాలం పనిచేశారు&period; ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు&period; అది విజయవంతం కావడంతో… రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు&period; ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు&period; 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత&comma; కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు&period; వీరికి ఒక కుమార్తె&period; టీడీపీలో ఉన్నా&period;&period; తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు రేవంత్ రెడ్డి&period; తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచే కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు&period; ఆ ఎన్నికల్లో 14&comma;614 ఓట్ల మెజారిటీతో రేవంత్ గెలిచారు&period; 2017లో రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు చంద్రబాబు&period; ఓవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడింది&period; కీలక నేతలంతా కేసీఆర్ పార్టీలో చేరిపోయారు&period; ఉన్న వారు పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండిపోయారు&period; దీంతో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కత్తిమీద సాములా మారింది&period; అప్పటికే ఓటుకు నోటు కేసులో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపిన రేవంత్ రెడ్డి&comma; కాంగ్రెస్ పార్టీవైపు దృష్టి సారించారు&period; కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది&period; తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ 17à°¨ ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి&comma; శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు&period; అక్టోబర్ 30à°¨ ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు&period; వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు&period; తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి&period; అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముగ్గురు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకరిగా ఎంపిక చేసింది&period; కాంగ్రెస్ లో ప్రస్థానం ప్రారంభించిన రేవంత్… 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగారు&period; ఆ దఫా ఆయన ఓటమి పాలయ్యారు&period; రేవంత్ కున్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది&period; 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చింది&period; నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఆయన 10&comma;919 ఓట్ల తేడాతో గెలుపొందిన రేవంత్… మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు&period; మార్పు కావాలి-కాంగ్రెస్‌ రావాలి అంటూ రేవంత్ ఇచ్చిన పిలుపును తెలంగాణ ఓటర్లు నిజం చేశారు&period; 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు&period; ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు&period; కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు&comma; ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత&comma; ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి&period; బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది&period; డీలా పడిపోయింది&period; రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌&period;&period; గజ్వేల్‌లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు&period; మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించారు&period; ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు&period; BRS తనకు పట్టున్న పలు నియోజకవర్గాలను కూడా కోల్పోయింది&period; పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రం రెండుచోట్ల పోటీ చేసినా&period;&period; కామారెడ్డిలో ఓడిపోయినా… కొడంగల్‌లో విజయం సాధించారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది&period; రెండుసార్లు అధికారమిచ్చిన BRS ను మార్చాలనే అభిప్రాయంతోపాటు&period;&period; కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఓటర్లపై ప్రభావం చూపింది&period; BRSకు చెందిన సీనియర్‌ నాయకులు ఓటమి పాలయ్యారు&period; పరాజయమే ఎరుగని నేతలను&period;&period; తొలిసారిగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌ యువ అభ్యర్థులు మట్టి కరిపించారు&period; BRS కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలను కాంగ్రెస్‌ బద్దలు కొట్టింది&period; గత నాలుగైదు ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని స్థానాలు కూడా ఇప్పుడు చేతికి చిక్కాయి&period; కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సీనియర్‌ నాయకుల్లో అత్యధికులు విజయం సాధించారు&period; కాంగ్రెస్ పార్టీ విజయతీరాలకు చేరింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..