61
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు. ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వయంగా ముఖ్యమంత్రి స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను రేవంత్ రెడ్డి స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.