రాహుల్ గాంధీ పై దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి..

Revanth reddy - Rahul Gandhi

Advertisements

&NewLine;<p>భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటించిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ గూండాలు దాడి చేశారని&comma; ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు&period; అసోంలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బతద్రువ సత్ర ఆలయానికి వెళ్లాలని భావించారని&period;&period; అయితే అధికారులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు&period; ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు&period; భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ స్పాన్సర్డ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను&period; రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం&comma; గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు&period; ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని… రాహుల్ భద్రత విషయంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు&period; ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవని గుర్తుంచుకోవాలన్నారు&period; మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారన్నారు&period; లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు&period; ఈ దేశ ప్రజల మద్ధతు ఆయనకు ఎప్పుడూ ఉందన్నారు&period; తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉందని&period;&period; ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా నిలవాలని&comma; పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..