తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ,ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశం జరిగింది . ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జై వీర్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, మందుల శామ్యూల్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్, బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళాంల, ఎస్ యల్ బి సి టన్నెల్, నక్కల గండి రిజర్వార్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అలాగే పిలాయిపల్లి కెనాల్, ధర్మ రెడ్డి కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టు లను పూర్తి చేయడానికి తగినంత బడ్జెట్ ను కేటాయించాలని ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు సుఖేందర్ రెడ్డి సూచించారు. జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి, పనులు త్వరగా అయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయి, ఇంకా ఎంత శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఎంత నిధులను ఖర్చు చేసింది, అలాగే ఇంకా ఎంత నిధులు అవసరం ఉన్నాయి అనే పూర్తి నివేదికను గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇరిగేషన్ అధికారులకు అందించారు. ప్రాజెక్టులు పూర్తి అయితే జిల్లాలో నీటి సమస్య ఉండదని, త్వరగా పనులు పూర్తి అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.
ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశం….
82
previous post