యువతను టార్గెట్ గా వస్తున్న”RK పురంలో”(RK Puram lo)
పవన్ దీపిక ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్, త్రిషల, రక్ష హీరోహీరయిన్లుగా శ్రీకర్ ప్రసాద్ కట్టా దర్శకత్వంలో నిర్మాత రవికిరణ్ గుబ్బల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “‘RK పురంలో'”(RK Puram lo). ఈ చిత్రం ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది.
ఈ సందర్భగా చిత్ర దర్శకుడు శ్రీకర్ ప్రసాద్ కట్టా(Shrikar Prasad Katta) మాట్లాడుతూ..
నేటి యువత డ్రగ్స్ బారిన పడి ఎటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు, వారి వల్ల సమాజంలో ఎటువంటి ప్రతికుల పరిస్థితులు మహిళలు ఎదుర్కుంటున్నారు అనేది ఈ చిత్ర కథాంశం. హీరో రవి కిరణ్ కొత్తవాడైన చాలా చక్కగా నటించాడు. రాజ్ కిరణ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అన్ని హంగులతో ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిత్ర నిర్మాత గుబ్బల రవి కిరణ్(Gubbala Ravi Kiran) మాట్లాడుతూ..
సమాజానికి ఉపయోగ పడే మంచి పవర్ ఫుల్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాను మా చిత్రంలో యూత్ కావలసిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసుకుని సినిమాను మే లో విడుదల చేయాలనుకుంటున్నాం, అని అన్నారు.
పవన్ దీపిక ఆర్ట్స్
హీరో – రవి కిరణ్
హీరోయిన్ – త్రిషల
II హీరోయిన్ – రక్ష
సమర్పించు గుబ్బల విజయ హేమ దీపిక
డైరెక్టర్ – శ్రీకర్ ప్రసాద్ కట్టా
నిర్మాత – రవి కిరణ్ గుబ్బల
సహ నిర్మాత – జక్కంపూడి శ్రీనివాస్ శ్రీదేవి
సంగీతం – రాజ్ కిరణ్
ఎడిటర్ – డి.కె
కెమెరా – K. వాసుదేవన్
మాటలు – శ్రీ కుమార్ దలిపర్తి
నిర్మాణ నిర్వహణ – వాసంశెట్టి రాజేంద్రప్రసాద్
పి అర్ ఓ: బాశిం శెట్టి వీరబాబు
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి