ఛత్తీస్ ఘడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా.. 12 మందికి పైగా గాయపడ్డారు. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు.. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గామం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో బస్సు పడింది. ఈ ఘటనలో 11 మంది అక్కడిక్కడే చనిపోగా.. నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికుల చికిత్సకు స్థానిక అధికారులు తగిన సహాయం అందించాలని కోరారు.
76
previous post