ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం (Memantha Siddham) యాత్ర ప్రారంభమైంది. యర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ (CM Jagan) ముఖాముఖి సమావేశమయ్యారు. యర్రగుంట్లలో వివిధ పథకాల్లో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారని జగన్ తెలిపారు. ఎక్కడా లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామన్నారు. ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు కోట్ల మందికిపైగా లబ్ధి చేకూరినట్లు తెలిపారు. వయసులో చిన్నోడినైనా నేను ఎర్రగుంట్లకు చేసిన అభివృద్ధి ఇదని.. 14ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఇదంతా చేయలేదని జగన్ ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయని.. మొట్టమొదటి సారిగా స్కూల్స్ కు మహర్ధశ కల్పించామని జగన్ తెలిపారు.
ఇది చదవండి: ఏపీలో డ్రగ్స్ వెనుక పురందేశ్వరి కుటుంబ సభ్యులే – జగన్
Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి