సికింద్రాబాద్ (Secunderabad) :
తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ (Secunderabad) అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి పద్మారావు గౌడ్ మన పార్టీ తరఫున పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి ఆలోచనలో పడ్డారని పేర్కొన్నారు. యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బీజేపీని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారని నిలదీశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.
ఇది చదవండి : బీజేపీ ఎమ్మెల్యే హరీష్ మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ..
కేసీఆర్ వెంట నడిచిన సైనికుడు పద్మారావు అని ప్రశంసించారు. పద్మారావును చూసి కిషన్ రెడ్డి భయపడుతున్నారంటే మన గెలుపు ఖరారైనట్లే అన్నారు. బీజేపీ తీరు ఎలా ఉందంటే… మోదీ జేబులో ఉండాలి, లేదంటే జైలులో ఉండాలి అన్నట్లుగా దేశంలో పరిస్థితి మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్సే అన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌లను ఓడించింది బీఆర్ఎస్ వారే అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డిని ఓడించేది మన పద్మారావే అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేశారా?