ఘనంగా శ్రీకాళహస్తి ఏడు గంగమ్మ జాతర

7 gangamma jaathara

Advertisements

&NewLine;<p>శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది&period; గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి&period; దక్షిణ కైలాసనాథుడు కొలువులో ఏడు గంగమ్మ ల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి&period;&period; మంగళవారం అర్ధరాత్రినుంచి బుధవారం తేల్లావారు జామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూలవిరాట్ కు విశేష అభిషేక పూజలు శాస్త్రయోక్తంగా నిర్వహించారు&period; అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మహా నైవేద్యం&comma; మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు&period; గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలు నిర్వహించారు&period; అనంతరం రజకుల ఆధ్వర్యంలో ఏడు గంగమ్మల మట్టి ప్రతిములు పసుపు ముద్దలు ప్రతిములను విశేష పూజలు జరిపి ఏడు గంగమ్మ కమిటీలకు అందజేశారు&period; ఏడు గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మ తీసుకొని తమతమ చెప్పరాల వద్దకు తీసుకువెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మూల విరాట్ పూజల అనంతరం ఏడుగంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువు తీరారు&comma;ఏడు గంగమ్మ కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళస్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు&period; పొన్నాలమ్మ&comma; అంకాలమ్మ భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి&period; తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పట్టుతూ కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు&period; కొందరు బలిలిచి అమ్మవారిని సంతృప్తి పరిచారు&period; పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు&period; అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి&period; బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూలస్థానాల్లో అమ్మవాళ్ళు కొలువుతిరి భక్తులకు కరుణాకటాక్షాలు అనుగ్రహించునున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.