81
కృష్ణా జిల్లాలో గన్నవరంలో చంద్రబాబుకు, సీఎం జగన్ కి లేఖ రాశామన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క హక్కుల తీర్మానం గురించి ఆలోచన చేయాలని సూచించామన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని ఆమె వెల్లడించారు. గత పది ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏనాడూ ఆంధ్ర గురించి ఆలోచించలేదన్నారు. చంద్రబాబు, జగన్ లు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టింది చాలన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల తీర్మానాన్ని ప్రజల కోసం పాస్ చేయాలన్నారు. ఆంధ్ర రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ద్రోహం చేసిందో చెప్పాలన్నారు. అసెంబ్లీలో చర్చలు జరిగి తీర్మానాన్ని ప్రెసిడెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు.