ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపం

Smallest river island in the world

Advertisements

&NewLine;<p>అస్సాం రాష్ట్రంలో ఒక అద్భుతమైన ద్వీపం ఉంది&period; దీని విశేషాలు తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి&period; ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ద్వీపంలో పర్వమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిచినట్లు చెబుతారు&period; దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం&period; అద్భుతమైన ప్రకృతి అందాలను అన్వేషించేందుకు ఈశాన్య భారతదేశం మీకు గొప్ప అవకాశాలను అందిస్తుంది&period; పచ్చదనంతో నిండిన పర్వతాలు&comma; రాతి మార్గాలు&comma; రంగులతో మెరిసే వాతావరణం&comma; బ్రహ్మపుత్ర నది&comma; దాని సహజ అందాలు మీకు మరచిపోలేని అనుభవాలను పంచుతాయి&period; ఈ ప్రాంతంలో ప్రకృతి వికాసం అందమైన ఛాయాచిత్రాల మాదిరిగా వైభవంగా కనిపిస్తుంది&period; ఈశాన్య భారతదేశం అన్ని కాలాల్లో పర్యటించదగ్గ అద్భుతమైన ప్రదేశం&period; కాబట్టి వింటర్ లో విరామం కోరుకునే వారు ఎక్కడికి వెళ్లాలో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది&period; ఈశాన్య ప్రాంతం సాహసాలకు కూడా స్వర్గధామం వంటిది&period; ప్రాచుర్యం పెద్దగా లేని కొన్ని అద్భుతమైన రహస్య ప్రదేశాలు ఇక్కడి పర్యాటకంలో ప్రత్యేక ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి&period; వాటిలో ముఖ్యమైనది అస్సాంలోని ఉమానంద ద్వీపం&period; గొప్ప చారిత్రక&comma; పురాణ ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశం టూరిస్టుల దృష్టికి దూరంగా ఉంది&period; వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అతి చిన్న నివాస ద్వీపం&period; ఈ నదీ ద్వీపంలో ఉన్న శివాలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు&period; అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఉన్న 5 ప్రముఖ దేవాలయాల్లో ఇది ఒకటి&period; కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి ముందుగా ఈ ఆలయాన్ని సందర్శించాలని భక్తుల నమ్మకం&period; బ్రిటిషర్లు ఈ ద్వీపాన్ని నెమలి ద్వీపం అని పిలిచేవారు&period; ఎందుకంటే ఇది నెమలి ఫించాల ఆకారాన్ని పోలి ఉంటుంది&period; ఎన్నో పురాణ గాధలు కూడా ఈ అరుదైన ప్రదేశం చుట్టూ అల్లుకుని ఉన్నాయి&period; పురాణ గాధల ప్రకారం ఉమానంద ద్వీపాన్ని &&num;8216&semi;భస్మాచల్&&num;8217&semi; అని కూడా పిలుస్తారు&period; ఇక్కడే పరమశివుడు కామ దేవుణ్ణి తన మూడవ నేత్రంతో భస్మం చేశాడు&period; భస్మ అంటే బూడిద&comma; చల్ అంటే స్థలం కామదేవుడు భస్మమైన ప్రదేశం కాబట్టి దీనికి భస్మాచల్ గా పేరు వచ్చినట్లు చెబుతారు&period; ఈ ద్వీపానికి మరో పురాణ కధనం కూడా ఉంది&period; పరమేశ్వరుడు తన సతీమణి పార్వతితో కలిసి ఇక్కడ నివాసం ఉండేవాడు&period; పార్వతి దేవిని ఉమాదేవి అని కూడా పిలుస్తారు&period; కాబట్టి ఈ ప్రాంతానికి ఉమానంద అని పేరు వచ్చినట్లు చెబుతారు&period; ఈ ద్వీపం మునిగితే గౌహతి నీట మునుగుతుంది&period; ప్రసిద్ధ జానపద కధల ప్రకారం బ్రహ్మపుత్రను శివుని సేవకుడిగా పేర్కొంటారు&period; అస్సాంలో ఇటీవల కాలంలో బ్రహ్మపుత్ర నది కారణంగా అనేక సార్లు వరదలు సంభవించినా ఈ నదిపై ఉన్న ఉమానంద ఆలయంలోకి మాత్రం నీరు చేరలేదు&period; ఉమానంద ద్వీపం ఎప్పుడు నీట మునుగుతుందో అప్పుడు గౌహతి నగరం కూడా నీట మునుగుతుందని నమ్ముతారు&period; ఆలయ నిర్మాణం à°¶à°¿à°µ భక్తుడైన గదాధర్ సింఘా అనే రాజు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడు&period; 1897లో ఏర్పడిన భూకంపానికి ఈ ఆలయం శిధిలమైంది&period; ఆ తరువాత ఒక స్థానిక వ్యాపారిచే దీనిని పునఃనిర్మాణం జరిగింది&period; ఈ ఆలయంలో వినాయకుడు&comma; విష్ణువు&comma; సూర్య భగవానుడు&comma; పార్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి&period; ఒక చిన్న కొండ ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AawyASSSEh"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tollywood-hero-venkatesh&sol;amp&sol;">కనకదుర్గమ్మని దర్శించుకున్న à°µà±†à°‚కటేష్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కనకదుర్గమ్మని దర్శించుకున్న à°µà±†à°‚కటేష్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tollywood-hero-venkatesh&sol;embed&sol;&num;&quest;secret&equals;bP781hos2R&num;&quest;secret&equals;AawyASSSEh" data-secret&equals;"AawyASSSEh" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PF5iJgkdm2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;good-news-for-ayyappaswamy-devotees&sol;amp&sol;">అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;good-news-for-ayyappaswamy-devotees&sol;embed&sol;&num;&quest;secret&equals;cLcpqceHFz&num;&quest;secret&equals;PF5iJgkdm2" data-secret&equals;"PF5iJgkdm2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..