ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారని ఏపీ మంత్రులు వనిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం పోటెత్తారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. కృష్ణంపాలెం హైవే నుంచి 6 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ ను సంఘ సంస్కర్తగా మంత్రి వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. నాలుగన్నరేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి 2లక్షల 60 వేల కోట్ల రూపాయలు జమ చేశారని తెలిపారు. ఇక ఏపీలో వృద్ధి రేటు పెంచిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పేదల ఆర్థిక స్థితిగతులు మార్చారని పేర్కొన్నారు. సామాజిక సాధికారత సాధ్యం చేసిన నేత జగన్ మాత్రమే అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. దీని కోసం దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
సామాజిక సాధికారత సాధ్యం…
84
previous post