శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ లీలలు

Shri Dattatreya

Advertisements

&NewLine;<p>కృతయుగములో బ్రహ్మ సృష్టి చేసెను&period; వారెల్లరు తపస్సులు జ్ఞాన విశారదులైరి&period; అందరూ పరమాత్మ ధ్యానంలో యుండుట వలన సృష్టి జరుగుట లేదు&period; ప్రజలలో అనురాగ విద్వేషాలు లేవు&period; ప్రాణిజాలమునకు సంసార సుముఖత కలిగించుటకు అవిద్య లేక మాయను సృష్టించుటకు బ్రహ్మ తీవ్రంగా ఆలోచిస్తూ&comma; ఆ క్రమంలో తీవ్ర ఒత్తిడి నొంది&comma; తాను సృష్టించిన అవిద్య వలన స్మృతిని కోల్పోయి&comma; వేదములను మరచిపోవుట వలన రేణుకాదేవిని ఆరాధించగా&comma; ఆమె ప్రత్యక్షమై&comma; దత్తాత్రేయుని ఆశీస్సులు పొందమని చెప్పి&comma; సహ్యాద్రిపై ఉన్న దత్తాత్రేయుని చూపించగా&comma; బ్రహ్మ అనఘాదేవి సమేత దత్తాత్రేయుని దర్శించి&comma; అన్నింటినీ మరిచానని&comma; పూర్వ స్మృతిని ప్రసాదించమని కోరగా&comma; రేణుకాదేవియే వేదమాత&comma; ఆహ్లాదిని&comma; జ్ఞానయోగి&comma; గాయత్రి… అని తెలిపి&comma; నీవు విస్మరించినదంతయు స్ఫురణకు వచ్చునని దత్త ప్రభువు చెప్పెను&period; అంతట అనఘాదేవి నుండి వేదములు రేణుకాదేవిని చేరినవి&period; పిమ్మట రేణుకాదేవిని&comma; అనఘాదేవిని బ్రహ్మ ప్రార్థించగా&comma; మరిచిన వేదములు&comma; గాయత్రీ మంత్రం స్ఫురణకు వచ్చెను&period; ఈ విధంగా బ్రహ్మకు దత్త ప్రభువు గురువై భాసిల్లెను&period; దత్తాత్రేయ స్వామి తనని దర్శించగోరువారిని అనేక విధాలుగా పరీక్షించేవారు&period; భయబ్రాంతులు గొలిపెడివారు&period; బాలోన్మత్త పిశాచ రూపములలో సంచరించేవారు&period; అంగనతో కూడి యుండి మద్యం సేవిస్తున్నట్లు కన్పించి&comma; తన దరి చేరేవారిని పరీక్షించేవారు&period; ఒకపరి దత్తాత్రేయ స్వామి ఏకాంత నిష్టలో తపస్సు చేయుటకై వెళ్ళుచుండగా&comma; ముని కుమారులు వారి వెంటపడగా&comma; దత్త ప్రభువు ఒక మడుగులో దిగి అదృశ్యుడయ్యెను&period; ముని కుమారులు చాలాకాలం ఆ మడుగు వద్దే వేచియుండిరి&period; దత్తుడు వందేళ్లు తర్వాత వారిని పరీక్షించుటకై&comma; ఒక అంగనతో కలసి నీటి నుండి బయటకు వచ్చి&comma; ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకొనగా&comma; అది చూసి కూడా ముని కుమారులు కదలలేదు&period; అప్పుడు దత్తుడు మద్యం సేవిస్తూ&comma; ఆమెతో సరసములాడుచు కొంత అసభ్యంగా ప్రవర్తించడంతో&comma; కొందరు మునికుమారులు ఇతను దురాచారపరుడు&comma; స్త్రీలోలుడు అని భావించి&comma; దత్తుని విడిచి వెడలిరి&period; ఇది దత్తలీల అని గ్రహించి నిలిచిన వారికి తన నిజ స్వరూపం చూపించి అనుగ్రహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Liv9BXZ3Ch"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sainath-is-a-millionaire&sol;amp&sol;">కోటీశ్వరుడు సాయినాథుడు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కోటీశ్వరుడు సాయినాథుడు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sainath-is-a-millionaire&sol;embed&sol;&num;&quest;secret&equals;hZUw50lRqE&num;&quest;secret&equals;Liv9BXZ3Ch" data-secret&equals;"Liv9BXZ3Ch" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..