సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం పరిధిలోని అడవివేముల గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో మందుల సామేలు గారిని ఏవిధంగా తుంగతుర్తి ప్రజలు 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారో, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఐదు లక్షల మెజారిటీతో గెలిపించాలని తుంగతుర్తి ప్రజలను కోరారు. కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మన అయిదు గ్యారెంటీ ల గురించి వివరించండి. ఈ 30 రోజులు కష్టపడండి హస్తం గుర్తుపై ఓటేయాలని ప్రచారం చేయమని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలను నాయకులను ప్రజలను కోరారు.
శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం…
97
previous post