146
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ తన్నీరముదు ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబి వారికి మేల్ చాట్ శేషవస్త్రాన్ని సమర్పించారు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీ వేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్ రామానుజాచార్యులవారికి మేనమామ. ఈ కార్యక్రమంలో తిరుమల జీయంగార్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.