పశ్చిమ రాజ గోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవం, హోమాల కార్యక్రమం…

Sri Veerabhadra Swamy Temple with Sri Bhadrakali

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వేలిసియిన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం నందు శ్రీశైలం వేద పండితులచే ఆలయ పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక&comma; సాలహార మహోత్సవ &comma;హోమం కార్యక్రమాలు శుక్రవారం నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి&period; రెండవ రోజు జరుగుతున్నా హోమం&comma; పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు&period; వారికీ ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ వారి భర్త మున్సిపల్ వైస్ చైర్మన్ పోలం రెడ్డి దశరథ రామిరెడ్డి&comma; ఆలయ ఈవో రమణా రెడ్డి ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు&period; అనంతరం శ్రీశైలం వేద పురోహితులు పరమేశ్వర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నా హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు&period; అనంతరం ఆలయ ప్రాంగణంలోనున్న వినాయకుడిని&comma; అఘోర లింఘేస్వరుడు తో పాటు శ్రీ వీరభద్ర స్వామి అమ్మవార్లను దర్శించుకొన్నారు&period; వారికీ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు&period; అనంతరం ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు&period; స్వామి వారి ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు&period; ఆలయ అభివృద్దితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కావాల్సిన వసతి ఏర్పాట్లు తదితర అంశాల గురించి వారిని అడిగి తెలుసుకొన్నారు&period; ఆలయ చైర్మన్ పొలం రెడ్డి విజయమ్మ&comma; ఈవో రమణా రెడ్డి&comma; శ్రీశైలం వేదం పురోహితులు పరమేశ్వర స్వామి లు మాట్లాడుతూ 2019 లో సిఎం జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ రాజ గోపురం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారన్నారు&period; కానీ కరోనా వైరస్ కారణంగా ఆ కార్యక్రమం అప్పట్లో నిర్వహించలేకపోయామన్నారు&period; తిరిగి స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&comma; రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి&comma; కలెక్టర్ గిరిషా పీఎస్ కృషితో పశ్చిమ రాజగోపురం సాలహారం ల నిర్మాణాలకు రూ 1&period;58 కోట్ల నిధులు మంజూరై పనులు కూడా పూర్తి కావడంతో శుక్రవారం నుండి పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక&comma; సాలహార మహోత్సవ పూజలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు&period; ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు వారు తెలియజేశారు&period; అందరికి శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి సంపూర్ణ కృపా కటాక్షాల తో పాటు శ్రీ భ్రమ రాంబ మల్లి కార్జున ఆశీస్సులతో మెండుగా కలగాలని ఇటువంటి దైవ కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నామన్నారు&period; ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు&period; ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్&comma; కమిటీ సభ్యులు రత్న శేఖర్ రెడ్డి&comma; సంబేపల్లె నాయకులు వివి ప్రతాప్ రెడ్డి&comma; మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్