శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం

Sri Venugopala Swamy Temple

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది&period; ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు&period; మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు&period; ఆ స్వామి మహత్యమూ సామాన్యమైనది కాదు&period; ఒకప్పుడు మౌద్గల్యుడు అనే గొప్ప రుషి ఉండేవారు&period; ఆయన మొవ్వకి సమీపంలో ఉన్న కృష్ణానదీ తీరంలో ఘోర తపస్సు చేసుకోసాగారు&period; ఒక రోజు ఆ మహర్షికి నదీతీరంలో వేణుగోపాలస్వామి విగ్రహం దొరికింది&period; ఆ విగ్రహాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించారు మౌద్గల మహర్షి&period; దానిని స్వామి ప్రతిరూపంగా తలచి నిత్యం పూజించేవారు&period; క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందింది&period; వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు&period; స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు ఉన్నాయి&period; స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు కూడా దర్శనమిస్తారు&period; చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి&period; ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది&period; ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టంచారు&period; అయినా ఇప్పటికీ పాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు&period; ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఉపాలయం కూడా ఉంది&period; స్వామివారి కుడిచేతిలో ఖడ్గం&comma; ఎడమచేతిలో సంజీవని ఉంటాయి&period; ఒకపక్క కోరుకున్న వరాలను అందిస్తూనే&comma; మరోపక్క దుష్టులను శిక్షిస్తాడనేందుకు సూచనగా స్వామివారి చేతులలో ఖడ్గమూ&comma; సంజీవనీ రెండూ కనిపిస్తాయి&period; మువ్వ పేరు వినగానే వేణుగోపాల స్వామి ఆలయమే కాదు&comma; ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పద్యాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తాడు&period; క్షేత్రయ్య పెద్ద పండితుడు మీ కాదు&period; ఆ మాటకు వస్తే అతను అక్షరాలు కూడా రాని ఒక గోవుల కాపరి&period; కానీ నిత్యం మొవ్వ గోపాలుని సేవించుకునేవాడు&period; వరదయ్య భక్తికి మెచ్చిన ఆ వేణుగోపాలుడు&comma; అతని నాలుక మీద బీజాక్షరాలు రాశారు&period; దీంతో వరదయ్య స్వామి వారి మీద గీతాలు రచించేంత జ్ఞానిగా మారాడు&period; తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు&period; ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు&period; అలా ఆయనకు క్షేత్రయ్య అని పేరు స్థిరపడిపోయింది&period; మొవ్వ వేణుగోపాలుడు దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుంది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..