90
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింగ పేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. అర్ధ రాత్రి సమయంలో కడుపులో నొప్పి వస్తుంది అని హుటాహుటిన హాస్టల్ నుండి కూనవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్కూల్ సిబ్బంది తరలించారు. కూనవరం ఆసుపత్రి వైద్యులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించమని చెప్పారు. వెంటనే ఆ అమ్మాయిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో 7వ తరగతి చదువుతున్న మడకం సంధ్య మృతి చెందింది. నా కూతురి మృతికి పాఠశాల సిబ్బందే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాల ముందు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ధర్నా నిర్వహిస్తున్నారు.