రామకృష్ణాపూర్ పట్టణ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు…

Sudden checks in Ramakrishnapur town center...

Advertisements

&NewLine;<p>రామకృష్ణాపూర్ పట్టణ కేంద్రం లో ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ నిర్వహించారు&period; స్పెషల్ డ్రైవ్ మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి&comma; మందమర్రి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు&comma; పట్టణం లోని ప్రధాన కూడళ్ళు క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర లో వాహనాల తనిఖీలు నిర్వహించారు&period; వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు&comma; డ్రైవింగ్ లైసెన్స్&comma; ఇన్సూరెన్స్&comma; నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు&period; రోడ్డు భద్రత నియమాలు&comma; ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు&period; వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు&comma; లైసెన్సులు&comma; ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు&period; ర్యాష్ డ్రైవింగ్ చెయ్యడం&comma; డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం&comma; మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం&comma; నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం&comma; మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు&period; ఈ తనిఖీ లో రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ &comma; దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు&comma; మందమర్రి ఎస్సై చంద్రకుమార్&comma; కాసిపేట ఎస్సై గంగారాం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్