ఆదరించండి ఆగిన అభివృద్ధిని కొనసాగిస్తా…

Bollineni Venkatarama Rao in Praja Divena Yatra program

Advertisements

&NewLine;<p>ఉదయగిరి పట్టణంలో దిలార్ బావి వీధి ముస్లిం కాలనీలో ఆరవ రోజు కొనసాగిన ప్రజా దీవెన యాత్ర కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు&period; బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకాన్ని ఆ ప్రాంత ప్రజలకు వివరిస్తూ టిడిపి ముద్రించిన కరపత్రాలను అందజేశారు&period; ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయగిరి పట్టణంలో చాలా సమస్యలు పేరుకు పోయాయన్నారు&period; ఎక్కడ చూసినా మురికి నీరు విజృంభిస్తుందని సరైన కాలువలు లేక రోడ్ల మీదకి మురికి నీరు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు&period; త్రాగునీరు చూస్తే మూడు&comma; నాలుగు రోజులకు వస్తున్నాయంటూ ఆవేదన చెందారు&period; తాను అధికారంలో ఉన్నప్పుడు త్రాగునీరు కోసం నియోజకవర్గానికి 460 కోట్ల రూపాయలతో మంచి నీటి పథకాలు తెస్తే దానిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కనపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఎద్దెవ చేశారు&period; ఉదయగిరి నా అడ్డ అని చెప్పుకు తిరుగుతున్న వైసీపీ నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలంటూ డిమాండ్ చేశారు&period; దొంగ సిమెంట్ పట్టుకుంటే మా నాయకులపై ఎస్సీ&comma; ఎస్టీ అట్రాసిటీ కేసులు బనయించడం తనకే చెల్లిందన్నారు&period; ఉదయగిరికి ఓ చరిత్ర ఉంది అది తెలుసుకుని మసులుకో అంటూ పరోక్షంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని హెచ్చరించారు&period; తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే అన్ని హంగులతో ఉదయగిరి ప్రాంతాన్ని తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు&period; ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు&comma; మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్