లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి..

suspicious death

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు&period; మృతుడు గత మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు&period; రెండు రోజులుగా అద్దె డబ్బులు కట్టకపోవడంతో తెల్లవారుజామున అద్దె కోసం రూమ్ బాయ్ తలుపులు తెరిచి చూడగా వ్యక్తి మృతి చెంది వికటజీవిగా పడి వున్నాడు&period; దీనితో లాడ్జ్ వాళ్ళు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు&period; సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన రాజశేఖర్ రావు&comma; వయసు 44 సంవత్సరాలుగా గుర్తించారు&period; మృతుడు గత కొద్ది సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలి శ్రీశైలంలో పలు హోటల్లో పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు&period; అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కరికి రూమ్ ఇవ్వకూడదని ఒకవేళ ఇచ్చిన అందుకు స్థానిక పోలీసుల పర్మిషన్ కావాలని తెలిసిన కూడా రూల్స్ కి వెతిరేకంగా రూమ్ ఇవ్వడంపై పలు అనుమానాలు తవిస్తున్నాయి&period; అనుమానస్పద మృతి ఘటనపై కేసు నమోదు చేసిన సుండిపెంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..