చంద్రబాబు హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా విరాజిల్లుతున్న రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పత్తిపాడు టిడిపి ఇన్చార్జి బుర్ర రామాంజనేయులు అన్నారు. నియోజకవర్గంలోని కాకుమాను మండల కేంద్రంలో బుర్ర రామాంజనేయులు రోడ్ షో, జయహో బిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలు అన్నింటిని ఒక కలం పోటుతో రద్దు చేశాడని అన్నారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ ను మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారు..
96
previous post