64
కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వ బోమని సింగరేణి అంటే సింహగర్జన అని, అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమన్నారు. సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బొగ్గు గని కార్మికులు ముఖ్య పాత్రను పోషించారని ప్రశంసించారు. సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదన్నారు. బొగ్గు గనుల్లో కార్మికుల కష్టం తెలంగాణలో వెలుగులు నిండేందుకు కారణమవుతుందన్నారు.