మడకశిర (Madakasira) లో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది. మడకశిరలో టిడిపి రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ వర్గీయులు. మడకశిర టిడిపి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు బీఫామ్ రావడంతో మడకశిర ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్న ఎంఎస్ రాజు, హిందూపురం టిడిపి పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి కారులో వస్తుండగా మడకశిర పట్టణంలో వారి కార్లపై రాళ్లతో దాడి చేసారు. టిడిపి వర్గాలు నాలుగు కార్లు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసారు. ఈరోజు మడకశిర టిడిపి రెబల్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో వీరు అటుగా రావడంతో కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా కంగు తిన్న ఎమ్మెస్ రాజు, పార్థసారతులను తరిమికొట్టగా కారులో వెనుతిరిగి వెళ్ళిపోయారు. వారి కారు అద్దాలను రాళ్లతో చెప్పులతో దాడి చేసి పగలగొట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిని బెదరగొట్టారు. మడకశిరలో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి