74
తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ సాగింది. అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధం జరిగింది. నువ్వెంతా అంటే నువ్వెంతా అనుకున్నారు. తాము చేసిన అభివృద్ధిని సోదాహరణంగా వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీని నిశితంగా బీఆర్ఎస్ విమర్శించింది. గత సర్కారు తప్పులను ఎత్తి చూపుతూనే తామేంటో చాటుకున్నారు మంత్రులు. ఏం చేయబోతున్నమో వివరించారు. కేసీఆర్ హయాంనాటి అవకతవకలను తవ్వి తీస్తామని హెచ్చరించారు.