77
తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది. అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి 7,700 కోట్ల రూపాయలు జమ చే్స్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్నది రైతుల ఓట్లే. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఒకటిక కాదు, రెండు కాదు… ఏకంగా 7,700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లున్నాయనగానే బీఆర్ఎస్ లో ఆనందం, కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమైంది. ఇది కచ్చింతంగా తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.