హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్

Human Trafficking

Advertisements

&NewLine;<p>నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాల ప్రకారం అత్యధిక మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది&period;<br>గతేడాది దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు కాగా 391 కేసులు తెలంగాణలో వెలుగు చూశాయి&period; 25 మంది బాలికలు&comma; 9 మంది మంది బంగ్లాదేశ్ యువతులు&comma; 641 మంది మహిళలు&comma; 38 మంది బాలురుతో సహా మొత్తం 704 మందిని రాష్ట్ర పోలీసులు కాపాడారు&period; బాధితుల్లో కొందరిని రెస్క్యూ హోమ్స్‌కు బాలకార్మికులను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు&period; మరికొందరిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు&period; 600 మందికి పైగా మహిళలు&comma; 100 మంది చిన్నారులకు మెట్రో నగరాలకు అక్రమంగా తరలించినట్టు ఎన్సీబీ నివేదిక చెబుతోంది&period; బంగ్లాదేశ్&comma; నేపాల్ దేశాలతో పాటూ ఇతర రాష్ట్రాల యువతులు&comma; మైనర్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు&period; తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందాలు క్రియాశీలకంగా ఉండటంతో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది&period; ఉద్యోగం&comma; ఉపాధి&comma; ప్రేమ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తెలంగాణకు రప్పిస్తున్నారు&period; చివరకు వ్యభిచార కూపాల్లో దించుతున్నారు&period; బీహార్&comma; యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాలకార్మికుల అక్రమ రవాణా సాగుతోంది&period; రాష్ట్రంలో మానవ అక్రమరవాణాకు చెక్ పెట్టేందుకు 30 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి&period; కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారం సీఐడీ పోలీసులు&comma; స్వచ్చంధ సంస్థలు&comma; చైల్డ్ ప్రొటెక్షన్&comma; లోకల్ పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరుతో ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్