తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలి? అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి, రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. డిసెంబర్ రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ద్వారా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రైతుభరోసా విధివిధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇటు సర్వే సైతం ఈ నెల చివరి వరకు ముగియనుంది. ఆ తర్వాత రాష్ట్రంలో బీసీ జనాభా ఏ మేరకు ఉందనేది క్లారిటీ వస్తుంది. అలాగే లోకల్ బాడీలో రిజర్వేషన్లు సైతం ఫైనల్ కానున్నాయి. సంక్రాంతి తరువాత లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉండడంతో ఈ లోపే రైతుభరోసా ఇచ్చి తీరాలనే టార్గెట్లో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సిక్స్ గ్యారంటీస్లో నుంచి రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ రెండు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి