అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన డ్రామాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆల్ రెడీ ఆదానీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఏడాది పాలనలో ఎటువంటి లోపాలు లేనందు వల్లే .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తిచూపాలి గానీ..ఈ విధంగా చేయడం సరికాదన్నారు. పాలనలో ఏవైనా లోపాలు ఉంటే చెబితే సరిదిద్దుకుంటామని, కానీ అవేమీ లేనందువల్లే బీఆర్ఎస్ డ్రామాలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో ఎన్నికల్లో ఇఛ్చిన హామీలను అమలు చేస్తున్నామని, కానీ బీఆర్ఎస్ ఎక్కడ తమకు మైలేజీ వస్తుందోనని భావించి.. అనవసరమైన ఆందోళనలకు దిగుతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు కట్టిపెట్టి.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్ధతు పలకాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
- ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
- ‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. క్రైమ్, థ్రిల్లర్ జానర్లో రాబోతోన్న ఈ సినిమాను శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్ల…
- ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్.ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్గా…
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 141491