జగన్ రైతుల ముఖాముఖి కార్యక్రమం వద్ద ఉద్రిక్తత…

Police stopped Bhuma Akhila Priya

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో సీఎం జగన్ రైతుల ముఖాముఖి కార్యక్రమం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు&period; దీంతో భూమా వర్గీయులకు&comma; పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది&period; రైతులతో ముఖాముఖి సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ వర్గం పై ఎమ్మెల్యే గంగుల నాని వర్గీయులు రాళ్లతో దాడి చేశారు&period; ఈ క్రమంలోనే టీడీపీ&comma; వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో భూమా అఖిల ప్రియని అరెస్ట్ చేసి&comma; శిరివెళ్ల స్టేషన్‌కు పోలీసులు తరలించే యత్నం చేశారు&period; పోలీసుల వాహనం ఎక్కేందుకు భూమా అఖిలప్రియ నిరాకరించారు&period; శిరివెళ్ల పోలీస్ స్టేషన్ కు నడుస్తూ వస్తానంటూ స్టేషన్‌కు అఖిల ప్రియ బయలుదేరారు&period; వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతుల పై ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చేయి ఎత్తారని అఖిల ప్రియా ఆరోపిస్తున్నారు&period; ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని…&period; పోలీసులు పట్టించుకోకపోతే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అఖిలప్రియ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..