న్యాయవాదులకు తెలంగాణలో ప్రత్యేక రక్షణ చట్టం అమలు..

న్యాయవాదులకు తెలంగాణలో ప్రత్యేక రక్షణ చట్టం అమలు..

Advertisements

<p>న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్భయంగా&comma; స్వతంత్రంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది&period; న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026 అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అమల్లోకి వచ్చింది&period; ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ జీవో ఎంఎస్ నంబర్ 41 ద్వారా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది&period; ఈ చట్టం ద్వారా కోర్టు అనుమతి లేకుండా లాయర్లను అరెస్టు చేయకుండా అత్యంత కీలకమైన రక్షణలు కల్పించారు&period;<&sol;p>&NewLine;<p>కొత్త చట్టంలో లాయర్లకు ఊరటనిచ్చే ప్రధాన అంశం అరెస్టుల నుంచి రక్షణ&period; ఇకపై పోలీసులు ఏ న్యాయవాదినైనా అరెస్టు చేయాలంటే ముందుగా న్యాయస్థానం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు&period; దీనివల్ల న్యాయవాదులపై జరిగే అక్రమ అరెస్టులు&comma; కక్షసాధింపు చర్యలకు&comma; వేధింపులకు శాశ్వతంగా చెక్ పడనుంది&period; అలాగే&comma; ఉద్దేశపూర్వకంగా న్యాయవాదులపై తప్పుడు కేసులు బనాయించే వ్యక్తులకు సైతం మూడేళ్ల జైలు శిక్ష&comma; రూ&period;25 వేల జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు&period;<&sol;p>&NewLine;<p>న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు చేసినా&comma; బెదిరింపులకు గురిచేసినా&comma; బహిరంగంగా దుర్భాషలాడినా ఈ చట్టం కింద కఠినంగా శిక్షిస్తారు&period; ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు మొదటిసారి రుజువైతే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ&period;25 వేల వరకు జరిమానా విధిస్తారు&period; ఒకవేళ నేరం పునరావృతమైతే ఆ శిక్ష మరింత కఠినంగా ఉంటుంది&period; జైలు శిక్షను ఒకటి నుంచి ఏడేళ్ల వరకు పొడిగిస్తారు&period; అలాగే జరిమానాను సైతం రూ&period;50 వేల నుంచి గరిష్టంగా లక్ష రూపాయల వరకు విధిస్తారు&period;<&sol;p>&NewLine;<p>గతంలో ప్రముఖ న్యాయవాద దంపతులు వామన్ రావు&comma; నాగమణి దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది&period; ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ&comma; వివిధ న్యాయవాద సంఘాల సుదీర్ఘ పోరాటాలు&comma; విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 30న శాసనసభలో ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది&period; తాజా చట్టం ప్రకారం&period;&period; తమకు ప్రాణహాని ఉందని భావించే ఏ న్యాయవాదికైనా ప్రభుత్వం తక్షణమే పోలీసు భద్రత కల్పిస్తుంది&period; లాయర్ల సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర&comma; జిల్లా&comma; మండల స్థాయిల్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీల ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది&period; సమాజంలో చట్టాన్ని&comma; ధర్మాన్ని కాపాడే న్యాయవాదులపై దాడులు జరిగితే&period;&period; అది మొత్తం న్యాయవ్యవస్థపై దాడి చేసినట్లేనని భావించి ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది&period; దేశంలోనే ఇలాంటి ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.

వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.

కామారెడ్డిలో రైల్వే ట్రాక్ పక్కన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం.