రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే అయిలయ్య.

Advertisements

<p>రైతు సంక్షేమం&comma; గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వ విప్&comma; ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు&period; యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్&comma; పాలకవర్గ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటివని పేర్కొన్నారు&period; రైతులకు నాణ్యమైన విత్తనాలు&comma; ఎరువులు&comma; పంట రుణాలు&comma; ధాన్యం కొనుగోలు వంటి సేవలను పారదర్శకంగా అందించడంలో పీఏసీఎస్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు&period; రైతులకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని&comma; సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.