జ్యోతిష్మతి కాలేజీ విద్యార్థి శవం లభ్యం…

Found student's body

Advertisements

&NewLine;<p><br>ఈ నెల ఒకటో తేదీన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో గల జ్యోతిష్మతీ కళాశాల నుండి బయటకు వెళ్లి అదృశ్యమైన ఎనగంటి అభిలాష్ &lpar;20&rpar; మృత దేహం లభ్యమైనట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు&period; తిమ్మాపూర్ సీఐ స్వామి&comma; ఎల్ఎండీ ఎస్సై చేరాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి&period; ఈ నెల ఒకటో తేదీన జ్యోతిష్మతీ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న ఎనగంటి అభిలాష్ కళాశాల హాస్టల్ నుండి అదృశ్యమైనట్లు తండ్రి ఎనగంటి శ్రీనివాస్ ఈ నెల మూడో తేదీన ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తిమ్మాపూర్ పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> అప్పటి నుండి ఇప్పటి వరకు పలు కోణాల్లో ధర్యాప్తు చేపట్టగా&period;&period; ఈ రోజు మహాత్మనగర్ శివారులోని జ్యోతిభాపూలే పాఠశాల సమీపంలోని గవ్వ రవీంధర్ రెడ్డి వ్యవసాయ బావిలో అభిలాష్ మృత దేహమును పోలీసులు గుర్తించారు&period; బావిలో శవాన్ని బయటకు తీసి బట్టలను&comma; సెల్ పోన్ ఆధారంగా అభిలాష్ మృతదేహాన్ని తండ్రి శ్రీనివాస్&comma; బంధువులు గుర్తించినారు&period; అభిలాష్ మృతదేహానికి అక్కడే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించారు&period; కాగా అభిలాష్ మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా ఆ కోణంలో ధర్యాప్తు చేస్తున్నామని తిమ్మాపూర్ సీఐ స్వామి&comma; ఎల్ఎండీ ఎస్సై చేరాలు తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..