సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకురావడం దారుణమని న్యాయవాది వంగర వెంకటాచార్యులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ భూహక్కు చట్టం 27/2023ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదుల సంఘము ఆధ్వర్యంలో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. అనంతరం ఆర్ డీవో అచ్యుత్ అంబరీష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ భూ హక్కు చట్టం కబ్జాదారులకు వరంగా మారనున్నదన్నారు. ఇది ఒక చీకటి చట్టం అన్నారు. రెవెన్యూశాఖ పాదాల చెంతకు ప్రజల ఆస్తి హక్కులును ప్రభుత్వం పెట్టిందన్నారు. మన హక్కులు కూడా డబ్బు పెట్టి కొనుక్కొనే చట్టం అన్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖ లో రెడ్ టేపిజం, లంచగొండితనం పెరిగి పోయిందన్నారు. అధికారులు ఉత్తర్వులు ఇస్తే జిల్లా, రాష్ట్ర ట్రిబ్యునల్ దానికే మద్దతు ఇస్తుందన్నారు. అధికారులు ఇచ్చిన తీర్పును హైకోర్టులో పెట్టాలి. ఇప్పటికే హైకోర్టులో పని భారం పెరిగి పోయిందన్నారు. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజలు అందరూ వ్యతిరేకించాలని కోరారు.
భూ హక్కు చట్టం రద్దు చేయాలంటూ ధర్నా..
77
previous post