ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో దివ్య ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామి వారి గిరి ప్రదక్షిణ సేవ భక్తులను అలరించింది. గజలక్ష్మి గుర్రాలు గోమాత ముందు నడుస్తుంటే ప్రచార వాహనంపై కొలువు తీరిన స్వామి వారు ఉభయదేవేరులు, కలిసి క్షేత్రపురవీథుల్లో ఊరేగారు. స్వామివారి పాతిక మండపం నుండి ఆలయం చైర్మన్ నివృత రావు, ఈవో వేండ్ర త్రినాథరావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రచార వాహనం కొలువు తీరిన స్వామివారి అమ్మవారు ప్రత్యేక అలంకరణతో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ముందు కదిలించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోలాట భజనలు కేరళ డప్పులతో శక్తి వేషధారణలతో భక్తులను అలరించారు. వెంకటేశ్వర స్వామి వారి వేషధారణ చేసిన ఇంత ఆకర్షణీయంగా ఉండటం మరో ప్రత్యేకత వివిధ దేవతల అవతారాల రూపంలో వేషాలను వేసి గిరి ప్రదిక్షణలో పాల్గొన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. గిరిప్రదక్షిణ వాహనంపై స్వామి అమ్మవార్లతో పాటు ఆలయ అర్చకులు ప్రత్యేక మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి వారి గిరిప్రదక్షిణ సుమారు 6 కిలోమీటర్లు జరిగింది. ఆలయ తొలిమెట్టు వద్ద పలువురు స్వామి అమ్మవార్లకు హారతులని ఇచ్చారు. అనంతరం క్షేత్రంలో తిరుగాడి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులు సమర్పించారు. ఈ ఉత్సవం ఆద్యంతం భక్తులను విచిత్ర వేషధారణలు, నృత్యాలు, భజనలు, శక్తి వేషలు వెంకటేశ్వర స్వామి వివిధ దేవుళ్ళ వేషధారణలు ప్రత్యేకముగా విశేషంగా ఆకట్టుకుంది.
ఘనంగా జరిగిన స్వామి వారి గిరి ప్రదక్షిణ సేవ…
71
previous post