92
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి సీతారాముల వారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవుళ్లను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం), వాహనం యొక్క గొడుగు, బంగారు పూతతో చేసినటువంటి ఇతర వస్తవులను సైతం రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన స్వీపర్ మరియు ఆలయ అర్చకులు గమనించి మరిపెడ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.