పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అడుగడుగునా ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తూ అహర్నిశలు కష్టపడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టి ఆ సంక్షేమ పథకాలలో 98 శాతం పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రి అని ఆయన తెలిపారు. జగన్ బాటలోనే అడుగులు వేస్తూ చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వైద్య రంగానికే వన్నెతెచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గురించి కనీసం ఆమె పేరు తలచుకునే హక్కు కూడా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కి లేదని రాజేష్ నాయుడు, పుల్లారావుపై మండిపడ్డారు. రజిని ప్రజలకు చేసే మంచి చూసి ఓర్వలేక పుల్లారావు నోటికి ఏది వస్తే అది మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతి అనే పదానికే తావు లేకుండా రజిని స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం దోచుకున్న చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. ఇసుక, మైనింగ్, రైస్, గ్రానైట్ తదితర వాటిల్లో అందిన కాడికి అవినీతి సొమ్ము దోచుకున్నారని రాజేష్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో విడదల గోపీనాథ్, కాట్రగడ్డ మస్తాన్రావు, ముక్తా వాసు, వలేటి హనుమంతరావు, మున్సిపల్ చైర్మన్ రఫాని, బేరింగ్ మౌలాలి, మరియు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అవినీతి అనే పదానికే తావు లేదు….
196
previous post