నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఏపీ శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా కార్యకర్తల పరిచయ కార్యక్రమం శక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా మాట్లాడుతూ నేను నందికొట్కూరు వాసిని మీ మనిషిని ఇక నుంచి మీ కష్ట సుఖాలు తెలుసు కోవడం కోసం నన్ను జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. నేను కర్నూలు పరిసర ప్రాంతములలో డాక్టర్ గా సేవలు చేశాను అందులో మొదటగా నందికొట్కూరు కె అందించాను. నేను డాక్టర్ నుంచి రాజకీయాల్లోకి రావడానికి కారణం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అన్నారు. కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ లేదు కార్యకర్తలు లేనిదే ఏ రాజకీయం లేదన్నారు. కార్యకర్తలు ఎవరెవరు నష్టం పోయారో వారినీ కాపాడకునే బాధ్యత నాదన్నారు. కార్యకర్తలను నాగుండెకు అత్తుకుని వారి కష్ట సుఖాలను పంచుకొని మీకు తోడుగా ఉంటానన్నారు. భారతదేశం లో ఎక్కడ లేనటువంటి విధంగా స్కూల్స్ కానీ ఆరోగ్య కేంద్రాలుకానీ అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.
కార్యకర్తలు లేనిదే పార్టీలు లేవు… కార్యకర్తలే దేవుళ్ళు
93
previous post